skip to Main Content

Dear All Across the Globe,


First of all, congratulations to all of you on the 1st anniversary of INSPIRE FOUNDATION India.
I believe that Inspire has grown to where it is currently because of 3 primary values – fairness in our behavior, transparency in all our practices and consistency in all our decision making.
It is because of our adherence to these principles that Integrative has seen such consistent success in the last seen.
I’m of the thought that an organization is just a concept, and Inspire is no different.
If we take care of this concept and play our parts well, it will take care of all us… and I proudly say that Inspire has taken care of all youth fairly well since its inception.
Every organization goes through periods of ups and downs, and this year is no exception. And it is in the tough times that we get to test how a company sticks together to come out of the dire situation TOGETHER.
I’ve been more than humbled to see how everyone not only contributed intellectually to the organization but were emotionally vested in taking on these never-before challenges by doing whatever they could to keep the business up and running.
I could never imagine that Covid 19 – the dreadful pandemic, would slowly turn out to be blessing in disguise, as I saw people blooming into their best & exhibiting their innate capabilities, which would otherwise had not been visible.
Also, the pandemic ushered in an era of digital communication where meeting each other over video meetings became the new normal.
It seems that the geographical distances between countries and differences in time zones have suddenly evaporated and the emotional touch of seeing each other in our daily meetings – is back once again.
We continue to build on the work we had started in the first place, and it is our firm conviction that prioritizing success is the foundation for long-term.
We have set our standards high, strived hard to achieve them, and elevated ourselves to higher places.
The learning and effort will never cease for team Integrative. I’d like all of us to remember that as we step into the new year, we need to focus on listening to the needs of our peoples and student s,Youth there are opportunities for all of us – and if we all pull together, we’re going to make it happen – even better than our previous years.
Lastly, I want to congratulate you all once again on this occasion.
The 1st Anniversary is a celebration across the entire year starting in July 2021 and culminating with the Celebration of Leadership on August 15.
The year of celebration involves everyone. We will be spotlighting members, reflecting on our history and milestones, and bringing people together for special events throughout the year.
This is an opportunity to reflect on the progress we have made together, look back at some of the obstacles we overcame, celebrate our diversity, and consider plans for our future.
The memory of this feat is sacred. On this day, we bow our heads in memory of those who, at the cost of their lives and health, defended their homeland, those who worked at the limit of human capabilities in the rear, making an invaluable contribution to the protection of their native land.
We pay tribute with a sense of deep gratitude to the INSPIRE ICONs and Supporters,wellWishers on the home front, living witnesses of our common heroic victory.
Your dedication and passion for your work make you what you are, one in a million. Keep raising the bar with your creativity.
Every organization requires a strong team player like you. We are proud to have you with us.
You have played a major role in bringing out the best in employees through team building and motivation.
Continue to shine and look forward to celebrating many more such anniversaries together.

INSPIRE ఫౌండేషన్ వార్షిక కార్యాచరణ నివేదిక

స్వామి వివేకానంద, APJ అబ్దుల్ కలామ్ వంటి మహానీయులను స్ఫూర్తిగా తీసుకుని, వారి ఆశయ సాధనకు నిరంతరం కృషి చేయడానికే INSPIRE ఫౌండేషన్ ను స్థాపించడం జరిగింది. మహోన్నత యువత కోసం – మహోజ్వల భవిత కోసం అనుక్షణం పని చేస్తుంది ఈ సంస్థ.

INSPIRE ఫౌండేషన్ 11 ప్రధాన అంశాలను వారధిగా చేసుకుని ముందుకు నడుస్తుంది.

ఏకాదశ సూత్రాలు

1) యువతకు ప్రేరణనందించి, వారిని మంచి మార్గంలో నడిపించడం, దేశం పట్ల, సమాజం పట్ల బాధ్యతగల పౌరులుగా వారిని తీర్చిదిద్దడం.

2) విద్యార్థులకు వారి ప్రాధమిక విద్యా దశలోనే ప్రత్యేక తరగతులు నిర్వహించి,మంచి ప్రవర్తన, సంస్కారం గలవారి గా తయారుచేయటం.

3) పేద మధ్యతరగతి యువతీ యువకులకు, ఉద్యోగం సాధించాలనే బలమైన సంకల్పంతో ఉన్నవారికి తరగతులు నిర్వహించడం ద్వారా వారి లక్ష్యసాధనకు మార్గదర్శనం చేయడం. విజయ మార్గం వైపు బాటలు వేయడం.

4) యువతీ యువకులను పబ్లిక్ స్పీకర్ గా, ట్రైనెర్స్ గా తయారుచేసి, వారి ద్వారా మరెంతో మంది యువతకు మోటివేషన్ ని అందిచడం.

5) మానవ సేవే మాధవ సేవ గా భావించి అనాధాశ్రమాలకు, వృద్ధాశ్రమాలకు సేవలందిచడం, అన్నార్తులకు ఆహారపదార్ధాలను అందించడం.

6) సేవా గుణమే ఇమ్యూనిటీ పవర్ గా మలుచుకుని, Covid వంటి వ్యాధిగ్రస్తులకు సహాయ సహకారాలు అందించి మేమున్నాం అనే భరోసా ఇవ్వడం.

7) ప్రకృతి వైపరీత్యాల ద్వారా నష్టపోయిన బాధిత కుటుంబాలకు సహాయం అందించి, వారికి అండగా నిలబడటం.

8) యువతీ యువకుల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించటం, వారి మేధస్సును దేశ భవితకై ఉపయోగించడం.

9) ప్రపంచ శాంతి కొరకు ప్రార్ధించడం, శాంతి స్థాపనకు నిరంతరం కృషి చేయడం.

10) వాతావరణ కాలుష్య నివారణ, పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా మొక్కలు నాటడం, పరిశుభ్రత, నీటి వాడకం పై ప్రజలకు అవగాహన కల్పించడం.

11) మతం కంటే మానవత్వం గొప్పది – కులం కంటే గుణం గొప్పది అనే గొప్ప సిద్ధాంతాన్ని పాటిస్తూ, సంస్థ యొక్క సేవా కార్యక్రమాలు అందరికి అందేలా చేయడం. ఈ సంస్థ లో అందరినీ కలుపుకుంటూ ముందుకు వెళ్లడం.

Inspire ఫౌండేషన్ స్థాపన కార్యక్రమం:

ఈ ఏకాదశ లక్ష్యాల సాధనకై 08 మే 2020 న ఘనంగా inspire ఫౌండేషన్ స్థాపించడం జరిగింది.

ఈ సంస్థ ప్రారంభించిన నాడు కేవలం 60 మంది సభ్యులతో zoom మీటింగ్ వేదికగా (covid నిబంధనల దృష్ట్యా) భవిష్యత్ కార్యాచరణపై చర్చా కార్యక్రమం నిర్వహించారు. ఏ విధంగా విద్యార్థులకు మోటివేషన్ తరగతులు నిర్వహించాలి? ఏ విధంగా Covid జాగ్రత్తలపై ప్రజలకు అవహగాహన కల్పించాలి? అన్నార్తులకు ఎలా సహాయం అందిచాలి? తదితర అంశాలపై చర్చ కొనసాగింది.

ఈ చర్చా కార్యక్రమం ఫలితంగా మరుసటి రోజునే అనగా 09-మే-2020 న గవర్నమెంట్ హాస్పటల్, ఆలయాల వద్ద ఉన్న అన్నార్తులకు, బీదలకు సంస్థ ఆధ్వర్యంలో ఆహరం అందించడం జరిగింది.

సంస్థ కోసం, సమాజం కోసం తమ సమయాన్ని వెచ్చించే యువతను ఈ ఫౌండేషన్ లో కలుపుకుని పోవడానికి సాంఘిక మాధ్యమాల ద్వారా అనేక అవగాహనా సదస్సులు మొదటి వారం రోజులలో నిర్వహించారు. ఈ కార్యక్రమాల ఫలితంగా ఎంతోమంది యువకులు ఈ ఫౌండేషన్ లో చేరడానికి ఆసక్తి కనబరిచారు.

మొట్టమొదటి మోటివేషన్ క్లాస్
సంస్థ ప్రారంభించిన తర్వాత మొట్టమొదటి మోటివేషన్ తరగతి భాస్కర్ గారిచే 22 మే 2020 న నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా ప్రముఖ ఉపన్యాసకులు శ్రీ లక్ష్మీపురం వేణుగోపాల్ గారు పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి “జీవిత-లక్ష్యం” అనే అంశంపై ప్రసంగించారు. ఈ కార్యక్రమం సాంఘికమాధ్యమం వేదికగా జరిగింది.

కుటుంబం వ్యక్తిత్వ వికాసం
26 మే 2020 న ప్రముఖ సినీ నటులు, ఉపన్యాసకులు అయిన శ్రీ KV ప్రదీప్ గారిచే యువతను ఉద్దేశించి “కుటుంబం వ్యక్తిత్వవికాసం” అనే అంశంపై ఉపన్యాస కార్యక్రమం జరిగింది. తప్పుదోవ పడుతున్న యువత ఏ విధంగా సరైన మార్గంలో నడవాలి? తన కుటుంబ బాధ్యతను ఏ విధంగా స్వీకరించాలి అనే అంశంపై ఈ ఉపన్యాసం కొనసాగింది.

ప్రపంచ పర్యావరణ దినోత్సవం 2020
జూన్ 5 వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్బంగా ఫౌండర్ JVS భాస్కర్ గారి పిలుపుతో inspire సభ్యుల ఆధ్వర్యంలో పాఠశాలలు, ప్రభుత్వ ఆసుపత్రులు, ఆలయాల ఆవరణలో మొక్కలు నాటించడం జరిగింది.

స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
దేశభక్తి, సామాజిక బాధ్యత అనేవి inspire సభ్యుల ప్రధమ లక్షణాలు. స్వాతంత్ర దినోత్సవ సందర్బంగా మహనీయుల త్యాగాలను సంస్మరించుకుంటూ వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి, JVS భాస్కర్ గారు ఉపన్యాసం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సుమారు 300 మంది యువతీ యువకులు పాల్గొన్నారు.

వినాయక చవితి – పర్యావరణ పరిరక్షణ
హిందువుల ప్రముఖ పర్వదినం వినాయక చవితి సందర్బంగా 20 ఆగష్టు 2020 న మట్టి విగ్రహాలనే పూజించాలని, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను వాడకూడదని అవగాహనా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా jvs భాస్కర్ గారి గ్రామ పరిధిలో మట్టి విగ్రహాలను వితరణ చేశారు.

గాంధీ జయంతి
2 అక్టోబర్ 2020 న inspire సభ్యుల ఆధ్వర్యంలో గాంధీ జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం సాంఘిక మాధ్యమం వేదికగా జరిగింది.

జాతీయ యువజన దినోత్సవం
12 జనవరి 2021 వ తేదీన స్వామి వివేకానంద జయంతి సందర్బంగా, inspire ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యువత ఎక్కువగా పాల్గొన్నారు. వివిధ కళాశాలలో inspire ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.

యువత – భారతదేశ సంపద
8 ఫిబ్రవరి 2021 న jvs భాస్కర్ గారు మరియు సంస్థ సభ్యులచే యువతకు మోటివేషన్ తరగతులు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధానంగా తప్పుదోవ పడుతున్న యువతను మంచి మార్గంలో పయనింపజేయడానికి, యువతే దేశానికి విలువైన సంపద అని తెలియజేయడానికి ఉపన్యాస కార్యక్రమాలు జరిపారు.

మహిళా దినోత్సవం
8 మార్చి 2021 న మహిళా దినోత్సవ సందర్బంగా inspire ఆధ్వర్యంలో “స్త్రీ శక్తి” అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళా సాధికారత అంశంపై అనేకమంది యువతులకు అవగాహనా కార్యక్రమం నిర్వహించారు.

మాస్కులు, మజ్జిగ వితరణ
జుత్తాడ భాస్కర్ గారు, వారి సోదరులు వరప్రసాద్ గారు మరియు inspire foundation సభ్యుల ఆధ్వర్యంలో గ్రామ ప్రజలకు మాస్కులను, మజ్జిగ ప్యాకెట్లను వితరణ చేశారు. ఈ సందర్బంగా జుత్తాడ వరప్రసాద్ గారు, జుత్తాడ భాస్కర్ గారు మాట్లాడుతూ కరోనా గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మాస్కులు ధరించడం, శానిటైజ్ చేసుకోవడం పై అవగాహన కలిగి ఉండాలని వివరించారు. కరోనా విజృంభిస్తున్న కాలం లో యువత అంతా కూడా స్వచ్చందంగా ముందుకు వచ్చి వృద్ధులకు, పేదలకు తమవంతు సాయం అందిచాలని పిలుపునిచ్చారు. రాబోయే కాలంలో మరిన్ని సేవాకార్యక్రమాలు చేస్తూ inspire ఫౌండేషన్ గ్రామవాసులకు తోడుగా ఉంటుందని ప్రసంగించారు.

మానవ సేవే మాధవ సేవ
INSPIRE ఫౌండేషన్ స్ధాపకులు, అధినేత అయిన జుత్తాడ భాస్కర్ గారు మరియు జుత్తాడ వరప్రసాద్ గారు మరియు INSPIRE సభ్యుల ఆధ్వర్యంలో జూన్ 19 తేదీన covid పేషెంట్స్ కి వారి కుటుంబాలకు ఒక నెలకు సరిపడా నిత్యావసర సరుకులు – 25kgs బియ్యం, కూరగాయలు, వ్యాధి నిరోధక శక్తికి గుడ్లు, ఖర్జూరం మరియు మాస్కులు, శానిటైజర్స్, గ్లౌజులు వితరణ చేసారు. భాస్కర్ గారి మిత్రులు మరియు విద్యార్థి బృందం పాల్గొన్నారు. ఈ సందర్బంగా JVS భాస్కర్ గారు మాట్లాడుతూ, ప్రజలకు తమ ఫౌండేషన్ ఎల్లప్పుడూ తోడుంటుందని, ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లో అయినా ప్రజలకు సహాయం చేయడానికి వెనుకాడబోమని, ఏ సమయంలో అయినా సహాయం కోసం INSPIRE ఫౌండేషన్ ని సంప్రదించవచ్చని తెలియజేసారు.

EPS – Effective public speaking
Inspire ఆధ్వర్యంలో EPS – Effective Public Speaking అనే ఒక గ్రూప్ ద్వారా ట్రైనర్ తేజ మరియు ట్రైనర్ మౌనిక గారి సహాయ సహకారాలతో పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ పై జూన్ 10 నుంచి 17 వరకు ట్రైనింగ్ ఇచ్చారు. ఈ సభలో ముఖ్య అతిధిగా ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ లక్ష్మీపురం వేణుగోపాల్ గారు, సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ చరణ్ గారు గారు పాల్గొని యువతను, విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు.
తదనంతరం inspire founder JVS భాస్కర్ గారు EPS కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు ప్రశంసాపత్రాలను అందజేశారు.

SOFT SKILLS ట్రైనింగ్
INSPIRE SOFT SKILLS TRAINING అనే ఒక గ్రూప్ ద్వారా పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ మరియు ఇంటర్వ్యూ స్కిల్స్ పై ట్రైనింగ్ ఇచ్చారు.
ఈ సందర్బంగా సంస్థ స్థాపించిననాటి నుండి ఇప్పటి వరకు జరిగిన అనేక సేవా కార్యక్రమాలను పురస్కరించుకొని INSPIRE విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ సభలో ముఖ్య అతిధులుగా మోటివేషనల్ స్పీకర్, యువతకు స్ఫూర్తి ప్రదాత అయిన జేడీ లక్ష్మీనారాయణ గారు, మోటివేషనల్ స్పీకర్ మరియు సినీ నటులు KV ప్రదీప్ గారు, IAS ఆఫీసర్ అద్దంకి శ్రీధర్ గారు పాల్గొని యువతను, విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు, జీవిత లక్ష్యాలను సాధించే దిశగా మార్గదర్శనం చేసారు. ఒకే వేదికపై ఇంతమంది ప్రముఖులు హాజరవటం వల్ల కార్యక్రమం కనుల పండువగా జరిగింది.
తదనంతరం inspire founder JVS భాస్కర్ గారు ముఖ్య అతిధులు చేతుల మీదుగా సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు ప్రశంసాపత్రాలను అందజేశారు.

ట్రైన్ ది ట్రైనర్
యువతకు మార్గదర్శనం చేసే మహోన్నత వ్యక్తిత్వం కలిగిన యువతీ యువకులను తీర్చిదిద్దటమే ప్రధాన లక్ష్యంగా ట్రైన్ ది ట్రైనర్ అనే మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది inspire ఫౌండేషన్.

inspire ఆధ్వర్యంలో పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ మరియు మోటివేషనల్ స్పీకింగ్ స్కిల్స్ పై ట్రైనింగ్ ఇచ్చారు. ఈ సభలో ముఖ్య అతిధులుగా యూత్ ఐకాన్, టెన్నిస్ క్రీడాకారులు, పర్వత అధిరోహకులు అయిన ఉమేష్ ఆచంట గారు, మోటివేషనల్ స్పీకర్ Dr లజ్వాన్తి నాయుడు గారు, ఉత్తమ అధ్యాపకులు, స్ఫూర్తి ప్రదాత దాడి అప్పల నరసింహ రావు గారు, మరియు అంకుష్ గుప్త గారు, చిప్పా కాశీ విశ్వనాధ్ గారు, నందుల శ్రీ తేజ గారు, ఆసమ్ అప్పారావు గారు పాల్గొని యువతను, విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు.
తదనంతరం inspire founder JVS భాస్కర్ గారు ముఖ్య అతిధులు చేతుల మీదుగా ట్రైన్ ది ట్రైనర్ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు ప్రశంసాపత్రాలను అందజేశారు. సంవత్సర కాలంగా తమ సంస్థ సాధించిన విజయాలను గుర్తుచేసుకుంటూ తమ INSPIRE FOUNDATION ఎంతోమంది విద్యార్థులకు ప్రేరణనిచ్చిందని, అనేక సేవా కార్యక్రమాలు తమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగాయని తెలియజేసారు. ఆదివారం సాయంత్రం సాంఘిక మాధ్యమం వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు 500 మంది వరకు విద్యార్థులు, యువత, లెక్చరర్స్ పాల్గొన్నారు.

INSPIRE ఫౌండేషన్ వార్షికోత్సవ వేడుకలు
Inspire ఫౌండేషన్ స్థాపించి ఏడాది పూర్తిచేసుకున్న సందర్బంగా జూలై 15 నుండి ఆగష్టు 15 వరకు మాసోత్సవాలు నిర్వహించారు. ఈ నెల రోజుల పాటు అనేక సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టారు. వక్తృత్వం, వ్యాసరచన, నాట్యం, పాటల పోటీలు, చిత్రలేఖనం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలలో ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి వందలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు.

INSPIRE – GENIUS QUIZ
Inspire ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆగష్టు 5 నుంచి 14 వరకు నేషనల్ లెవెల్ ఆన్లైన్ క్విజ్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో సుమారు 1000 మందికి పైగా పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. ఈ కార్యక్రమం మూడు దశలలో జరిగింది. మొదటి రెండు స్క్రీనింగ్ మరియు మూడవ దశలో చివరి ఐదుగురు విజేతలను ప్రకటించారు.

విజేతలకు మరియు పాల్గొన్నవారికి ముఖ్య అతిధులైన JD లక్ష్మీనారాయణ గారు, వేణుగోపాల్ గారు, మేధా చిరంజీవి గారు, IAS శ్రీధర్ బాబు గారు, KV ప్రదీప్ గారి ఆధ్వర్యంలో ప్రశంసాపత్రాలను అందజేశారు.

ఈ విధమైన సేవా కార్యక్రమాలతో మొదటి సంవత్సరం దిగ్విజయంగా పూర్తి చేసుకున్న ఈ inspire ఫౌండేషన్ మరెన్నో కార్యక్రమాలు జరిపి మంచి సమాజ నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని ఆ సర్వేశ్వరున్ని ప్రార్ధిద్దాము.

Back To Top